● నగర మేయర్ కూరగాయల ఉమారాణి
● ఆదర్శ మహిళలకు సన్మానం
సుభాష్‌నగర్/ ధర్పల్లి/ తెయూ(డిచ్‌పల్లి)/ నిజామాబాద్ రూరల్: భారతీయ సంస్కృతికి ఆధారం మాతృమూర్తులే అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇందూరు మొట్టమొదటి మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థంగా ఆమె మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్ శనివారం ఎల్లమ్మగుట్టలోని మున్నూరు కాపు సంఘంలో ఆదర్శ మహిళల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమారాణి మాట్లాడుతూ.. ఇంటిని తీర్చిదిద్దడంలో సీ్త్ర శ్రమ ఎంతో ఉందన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ కృష్ణశాస్త్రి విజయభాస్కర్ మాట్లాడుతూ.. దేశంలో పుట్టి చిరస్మరణీయులుగా నిలిచిపోయిన ఎంతోమంది మహనీయులు వెనక ఉన్నది వారి తల్లులు మాత్రమేనని, అందుకే సీ్త్ర తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదని ఆయన అన్నారు. అనంతరం పలువురు ఆదర్శ మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ, కార్యక్రమ నిర్వాహకులు మాదాసు స్వామి యాదవ్, బీడీ కార్మికురాలు బెల్లాల్ సావిత్రి, మహిళలు పాల్గొన్నారు. నగరంలోని మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు కుటుంబం, సమాజానికి బలమైన ఆధారమన్నారు. అనంతరం పలువురు మహిళాసిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారికత విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టారు. మెహెంది పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ జ్యోతి, మహిళా సాధారికత విభాగం కోఆర్డినేటర్ శారద, సరిత, నిహారిక, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని జేసీఐ పూర్వ అధ్యక్షురాలు జిల్కర్ లావణ్య అన్నారు. జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో నగరంలోని వీఎన్‌ఆర్ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల మాతృ మూర్తులకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ పూర్వ అధ్యక్షుడు గంగాదాస్, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి, ప్రముఖ మెజీషియన్ వేదాంతం రంగనాథ్, పాఠశాల కరస్పాండెంట్ యాదేశ్ గౌడ్, డైరెక్టర్లు వీణారాణి, ప్రసన్న, నరహరి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
మోపాల్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని సిర్‌పూర్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం లాటికర్ రాము అన్నారు. శనివారం మండలంలోని సిర్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొడ్డు గౌతమి గణేశ్, పాఠశాల కమిటీ చైర్మన్ రేణుక, ఎండీఎం కార్మికులు, పాఠశాల ఆయాను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అనురాధ, గంగాప్రసాద్, సుకన్య, ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


