నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింహులు గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. ఐదు వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్ర భుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న హైదరాబాద్‌లో చేపట్టే ధర్నాను గీత కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పెద్దివెంకట రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్, సాయాగౌడ్, శ్రీరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి కుండలు, ప్రమిదలు, గృహోపకరణాల తయారీ పై శనివారం కార్యశాల నిర్వహించారు. ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందేందుకు విద్యార్థులు ఇలాంటి కార్యశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మట్టితో చేసిన వస్తువులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ రంజిత, సభ్యులు రజిత, విజయ, డాక్టర్ నరేశ్, డీఏ అనూష, వినయ్ కుమార్, శ్రీనివాస్, సతీశ్, సంతోష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణను ఆలూరు మండలం ఢీకంపల్లి కాంగ్రెస్ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాంగ్రెస్ నాయకుడు పడమటి ప్రవీణ్, ఓబీసీ జిల్లా నాయకుడు రాజా నరేంద్ర గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.
నిజామాబాద్ రూరల్: బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్‌ను రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ నియమించారు. తనపై నమ్మకంతో జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన నాయకులకు లక్ష్మణ్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు.
డిచ్‌పల్లి: వంద రోజుల హెల్త్ క్యాంప్‌లో భాగంగా శనివారం డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బాలికలకు రక్తపరీక్షలు, ఒత్తిడి నిర్వహణ, సీపీఆర్‌పై శిక్షణ, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో అశ్విని, డాక్టర్ సందీప్, మండల వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ప్రిన్సిపాల్ మాధవీలత, శివప్రసాద్, తహిమినా ఫాతిమా, ఆశాలత, మౌనిక, జ్యోతి, సుమలత, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు పాదపూజ
ఖలీల్‌వాడి: నగరంలోని వీఎన్‌ఆర్ పాఠశాలలో శనివారం త ల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రము ఖ వ్యక్తిత్వ వికా స నిపుణులు తిరునగరి శ్రీహరి మాట్లాడు తూ.. పిల్లలను పెంచడం ఒక గొప్పకళ అని అన్నారు. పి ల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నా రు. ప్రముఖ మెజీషియన్ రంగనాథ్ చేసిన మ్యాజిక్ షో అందరినీ అలరించింది. కార్య క్రమంలో జేసీఐ ఇందూర్ ప్రతినిధులు లావణ్య, నయన్, గంగాదాస్, వీఎన్‌ఆర్ పాఠశాల కరస్పాండెంట్ యాదేశ్, డైరెక్టర్లు వీణ, ప్రస న్న, నరహరి, కావ్య తదితరులు పాల్గొన్నారు.


