సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Mar 8 2026 7:37 AM | Updated on Mar 8 2026 7:37 AM

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

మోపాల్‌: రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి శిరీష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 9 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీవరకూ ఆవులు, గేదెలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 4 నెలలు, ఆపైన పశువులకు టీకాలు ఇప్పించాలని, ఈ అవకాశాన్ని మండలంలోని పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 9న మోపాల్‌, 10న కులాస్‌పూర్‌, కులాస్‌పూర్‌ తండా, 11న కంజర్‌, 12న న్యాల్‌కల్‌, 13న సిర్‌పూర్‌, 14న కాల్పోల్‌, 16న మంచిప్ప, 17న బైరాపూర్‌, 18న తాడెం, 20న బాడ్సి, 23న ఎల్లమ్మకుంట, 24న నర్సింగ్‌పల్లి, 25న అమ్రాబాద్‌, 26న ముదక్‌పల్లి, గుడి తండా, 27న చిన్నాపూర్‌, సింగంపల్లి, 28న కాస్‌బాగ్‌ తండా, ఒడ్డెరకాలనీల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

అవార్డు గ్రహీతతో సర్పంచులకు శిక్షణ

సుభాష్‌నగర్‌: నూతనంగా ఎన్నికై న నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల సర్పంచులకు నగరంలోని న్యాక్‌భవన్‌లో శనివా రం శిక్షణనిచ్చారు. తెలంగాణ నుంచి గతంలో జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్‌ పాట్కూరి తిరుపతిరెడ్డి శిక్షణా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్నారు. జాతీయస్థాయిలో అవార్డు తీసుకొచ్చేందుకు పరిగణనలోకి తీసుకునే అంశాలు, తాను సాధించిన జాతీ య అవార్డు గురించి వివరించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు ఎలా సాధించాలి.. గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం తదితర అంశాలపై శిక్షణనిచ్చారు.నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పంచాయతీ అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

తప్పుడు షూరిటీ కేసులో ఇద్దరి అరెస్ట్‌

నిజామాబాద్‌ అర్బన్‌: తప్పుడు షూరిటీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌ హెచ్‌ వో రఘుపతి శనివారం తెలిపారు. కోర్టులో షూరిటీగా హాజరయ్యేటప్పుడు తమ పై లేని ఆస్తులను చూపిస్తూ తప్పుడు గృహ విలువ సర్టిఫికెట్లు, హౌస్‌ టాక్స్‌ రసీదులు ఇతర పత్రాలను నకిలీగా తయారు చేసి కోర్టులో సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రత్నం, ముజాపురుల్లా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరు ఓ కేసులో తప్పుడు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని, విచారణ చేపట్టి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం

నిజామాబాద్‌ రూరల్‌: విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం, యజ్ఞ కార్యక్రమాన్ని శనివారం శనిర్వహించారు. కార్యక్రమంలో ప్రాంత కృషి ప్రముఖ్‌ దాత్రిక రమేశ్‌ జీ, జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్‌, జిల్లా సేవా ప్రముఖ్‌ రాంప్రసాద్‌ చటర్జీ, రాజేశ్వర్‌, తులసీదాసు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్ధంతి సభను జయప్రదం చేయండి

నిజామాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌లో ఈ నెల 10న ని ర్వహించే నిర్వహించే రాయల సుభాష్‌ చంద్రబోస్‌ 10వ వ ర్ధంతి సభను జయప్రదం చేయాలని సీపీఐఎంఎల్‌ మాస్‌లైన్‌(ప్రజాపంథా) నగర కార్యదర్శి ఎం సుధాకర్‌ కోరారు. నగరంలోని కోటగల్లీలో ఉన్న కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం వర్ధంతి సభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీ గోదావరి, కే సంధ్యారాణి, కర్క గణేశ్‌, వినోద్‌, లింగం, విఠల్‌, గంగాధర్‌, శివ పాల్గొన్నారు.

విద్యార్థుల విజ్ఞాన యాత్ర

సిరికొండ: మండలంలోని న్యావనంది జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. గ్రామా నికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఉమ్మాజీ నరేశ్‌ విజ్ఞా న యాత్రకు తగిన సహకారం అందించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో యాత్రను ఎమ్మెల్యే భూపతిరె డ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం పదో తరగతి వి ద్యార్థులకు పరీక్ష సామగ్రిని ఎమ్మెల్యే అందచేశారు. ఉమ్మాజీ నరేశ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నియామకం

సిరికొండ: బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బందెల ధర్మపురిని నియమించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి హాజరై ధర్మపురిని సన్మా నించారు. పార్టీ జిల్లా నాయకుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి,రంజిత్‌రెడ్డి, రామస్వామి, బాబురావు, గంగామురళి, కిరణ్‌, మధు, లింబాద్రి, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రెండో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి స్థానిక ఎస్సై సయ్యద్‌ముజాయిద్‌ ఆధ్వర్యంలో డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. అహ్మద్‌బజార్‌, బోధన్‌ రోడ్డు, తదితర ప్రాంతాల్లో వస్త్రదుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలను తనిఖీలు చేపట్టినటులఎస్సై తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఈ తనిఖీలు చేపట్టామని ప్రజల్లో భద్రత కలిగించేలా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సెల్‌ఫోన్ల అప్పగింత

మోపాల్‌: మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న ఆరుగురి సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. మండలంలో ఫోన్లు పోయిన వారు పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా ఫోన్లను గుర్తిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement