పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలి

Mar 8 2026 7:37 AM | Updated on Mar 8 2026 7:37 AM

మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌

సుభాష్‌నగర్‌: నగరంలోని ఆస్తిపన్ను బకాయిల వసూళ్లలో వేగం పెంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశపు హాల్‌లో ఆస్తి పన్ను బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. నగరంలో ఆస్తి పన్ను బకాయిలు రూ.95కోట్లకుపైనే ఉందని, ఇప్పటివరకు రూ.35కోట్ల వరకు వసూలైందని తెలిపారు. మిగతా బకాయిలు కూడా వసూలు చేసేలా స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ కోసం మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బందితో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వీలైనంత వరకు లక్ష్యం చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆ తర్వాత చెల్లించే వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. యజమానులు తమ ఆస్తి పన్నులను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌ సాగర్‌, డీసీ రవిబాబు, ఏసీపీలు, ఆర్‌ఓలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement