నిజామాబాద్ రూరల్: అన్నివర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జలాల్‌పూర్ గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్పంచ్ చెన్నూరు నవనీత వెంకట్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గనిశెట్టి రాజు కుమారుడి వివాహం రెండురోజుల క్రితం జరగగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, నాయకులు బాగారెడ్డి, కార్పొరేటర్ అగ్గుభోజన్న, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


