● అంతర్జాతీయ మహిళ
దినోత్సవంలో వక్తలు
● పలు చోట్ల మహిళలకు సన్మానం
బోధన్/పెర్కిట్/డొంకేశ్వర్/ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట్/రుద్రూర్: నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికి మరింత చైతన్యవంతులై ప్రతిభావంతులుగా ఎదగాలని వక్తలు పేర్కొన్నారు.ఆదివారం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల మహిళలను సన్మానించారు.మహిళలు చదువు, కుటుంబం, ఉద్యోగం, రాజకీయాలు,క్రీడలు వ్యాపారం వంటి అన్ని రంగాలలో ముందుండి రాణించాలని ఆకాక్షించారు.


