నీల వాసికి ‘గద్దర్‌ అవార్డు’ | - | Sakshi
Sakshi News home page

నీల వాసికి ‘గద్దర్‌ అవార్డు’

Mar 8 2026 7:56 AM | Updated on Mar 8 2026 7:56 AM

ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకోనున్న

అనురాగ్‌ కులకర్ణి

రెంజల్‌(బోధన్‌): పాటలే ప్రాణంగా చిన్నతనం నుంచి సినిమాల్లో రాణిస్తున్నారు రెంజల్‌ మండలం నీల గ్రామానికి చెందిన అనురాగ్‌ కులకర్ణి. తెలంగాణ గద్దర్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన తండ్రి మారుతిరావు కులకర్ణి సాక్షితో మాట్లాడారు. అనురాగ్‌ కులకర్ణి ఇప్పటి వరకు 500 సినిమాల్లో సుమారు వెయ్యి పాటలు రాసి పాడారని పేర్కొన్నారు. ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమాలో రాంబాయి నీ మీద మనసాయనే అనే పాటకు గద్దర్‌ అవార్డు వరించినట్లు తెలిపారు. తన కుమారుడికి ఉత్తమ గాయకుడిగా అవార్డు లభించడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మరాఠి, తెలుగు భాషాల్లో పలు చిత్రాలకు పాటలు రచించినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement