మోర్తాడ్(బాల్కొండ): ఆమె చదివింది బీ ఫార్మసీ.. కానీ ఇష్టంతో గ్రూప్–2 సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి ఏమాత్రం సారూప్యత లేకపోయినా యూనిఫాం సర్వీసులోనే ఎంతో తృప్తి ఉందని చెబుతున్నారు బొండ్ల మానస. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మానస ప్రస్తుతం మోర్తాడ్ ఎకై ్సజ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. వైద్య విద్యనభ్యసించాలని ఇంటర్ బైపీసీలో చేరిన మానసకు సరైన ర్యాంకు రాకపోవడంతో మెడిసిన్ చదివే అవకాశం లభించలేదు. తండ్రి మల్లయ్య సూచనతో బీఫార్మసీ చదివారు. ఆ తర్వాత ఆదిలాబాద్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు.కానీ యూనిఫాం సర్వీసు ఏకై క లక్ష్యంతో గ్రూప్–2 రాసి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సుజాత, మల్లయ్య, బ్యాంకు అధికారైన భర్త వంశీ కృష్ణ ప్రోత్సాహంతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నానని మానస తెలిపారు.


