‘సాక్షి’ స్టార్ రిపోర్టర్‌గా కూరగాయల ఉమారాణి
స్టార్ రిపోర్టర్ (మేయర్) : కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి ?
కాలనీవాసులు : మా డివిజన్ (49వ డివిజన్) నుంచి మీరు కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. అద్దె ఇళ్లల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుకుంటున్నాం.
● రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు
● కాలనీల్లో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీటి సమస్యలను గతంలో పలుమార్లు కార్పొరేటర్లు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. డ్రెయినేజీల్లోంచి దుర్వాసన వస్తోంది. రోగాల బారిన పడుతున్నాం.
● ప్రభుత్వం నుంచి ఇంకా మీరు కోరుకుంటున్న అభివృద్ధి ?
● డివిజన్‌ను నగరంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రతిరోజూ చెత్త సేకరించాలి, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం చేపట్టాలి. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య పరిష్కరించాలి. కాలనీవాసులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. అమృత ధార ద్వారా ఇంటింటికి తాగునీటి వసతి కల్పించాలి. డ్రెయినేజీలను ప్రతిరోజూ శుభ్రం చేయించాలి.
పారిశుద్ధ్య కార్మికులతో..
స్టార్ రిపోర్టర్ (మేయర్) : పారిశుద్ధ్య కార్మికులుగా మీ జీవన విధానం
పారిశుద్ధ్య కార్మికులు : ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి మా పని మొదలవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాం. ఇదే మా దినచర్య. పని చేస్తేనే జీతం వస్తుంది. జీతాలు వస్తేనే పూట గడుస్తుంది.
● జీతం ఎంత వస్తుంది
● ప్రతినెల రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు వస్తుంది. ఈ జీతం సరిపోవడంలేదు. మీరే ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెంచితే మేలు. కనీసం రూ.20 వేల వరకు ఇస్తే బాగుంటుంది. అధికారులకు చెప్పినం కానీ.. మీరు ప్రభుత్వంతో మాట్లాడి పెంచాలి.
● అనారోగ్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు
● మా పని అంతా చెత్తా, దుమ్ములోనే. మురుగుకాల్వల్లో చెత్త తీస్తాం. ఈ సమయంలో అనేక రోగాల బారిన పడుతున్నాం. పని మానేసి తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం. మున్సిపాలిటీ నుంచి నూనె, సబ్బులు, గ్లౌజు లు అందుతున్నాయి. ఆరోగ్య బీమా కల్పించాలి.
ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సాయం
కోరుకుంటున్నారు
ఈ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చిన వారు అనారోగ్యంతో తరచూ సెలవులు పెడుతూ, మానేస్తున్నా రు. దీంతో ఉన్న వారిపై నే పనిభారం పడుతుంది. అవసరం మేర కార్మికు లు లేరు. చీపుర్లు, గ్లౌజులు, షూలు, పారలు, ఫాగింగ్ యంత్రాలు, మాస్కు లు, ఇతరత్ర పని పరికరాలు సరిపడా ఇవ్వాలి. వే తనాలు పెంచే బాధ్యతను మీరు తీసుకోవాలి. ప్ర భుత్వం పథకాల్లో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి.
‘నేను మీ ఉమారాణిని.. మీరంతా నా వాళ్లే.. ప్రతి రోజూ మీతో కలిసే ఉంటాను.. మాట్లాడతాను.. కాలనీలో సమస్యలు ఏమున్నాయి..’ అంటూ నగరంలోని 49వ డివిజన్‌లో కాలనీవాసులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్ (నగర మేయర్) కూరగాయల ఉమారాణి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు, జీతభత్యాలు, ఆరోగ్యం, ప్రభుత్వం నుంచి ఇంకా అందాల్సిన సాయంపై ఆమె ఆరా తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ ‘సాక్షి’ స్టార్ రిపోర్టర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 99 రోజులపాటు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రభుత్వంతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. – సుభాష్‌నగర్
కాలనీల్లో పర్యటించి ఇబ్బందులు
తెలుసుకున్న నగర మేయర్
మహిళా దినోత్సవం సందర్భంగా
ప్రత్యేక కార్యక్రమం


