మహిళల ఆరోగ్యంపై చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆరోగ్యంపై చొరవ చూపాలి

Mar 8 2026 7:56 AM | Updated on Mar 8 2026 7:56 AM

తెయూ(డిచ్‌పల్లి): సమాజంలో ప్రజా ఆరోగ్యం, పౌష్టికాహారం ప్రమాణాల విషయంలో లింగ వివక్ష, లింగపరమైన అసమానతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మహిళలు తీవ్రమైన పౌష్టికాహార సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి ప్రసూతి సమయంలో ఆపరేషన్లు (సిజేరియన్‌) తప్పనిసరి అవుతున్నాయి. 70 శాతానికి పైగా యువతులు, మహిళలు, 80 శాతం వరకు గర్భిణులు తీవ్రమైన ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. దీని ప్రభావం పుట్టే పిల్లలపై పడుతోంది. ఏటా పది లక్షల కొత్త క్యాన్సర్ల కేసులు నమోదవుతుంటే అందులో 70 శాతం మహిళా బాధితులున్నారు. ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టాలి. ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టాలి. మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి.

– మోచి సిద్ధలక్ష్మి, ఎకనామిక్స్‌ లెక్చరర్‌,

గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, మద్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement