షాదీఖానాకు నిధులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

షాదీఖానాకు నిధులు విడుదల చేయాలి

Mar 9 2026 7:19 AM | Updated on Mar 9 2026 7:19 AM

ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌

మోర్తాడ్‌: తాను మంత్రిగా ఉన్న సమయంలో బాల్కొండలో షాదీఖానాను నిర్మించడానికి రూ.30లక్షల నిధులు మంజూరు చేయించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేసిందని ఇప్పుడు వెంటనే నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం బాల్కొండలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. మైనారిటీలకు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే స్వర్ణయుగం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. బాల్కొండ షాదీఖానాకు నిధులు విడుదల అయ్యే వరకూ తాను వ్యక్తిగతంగా పోరాడుతానని హామీ ఇచ్చారు. నిధులు విడుదల అయ్యే వరకూ ఊరుకునేది లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, మైనారిటీలు పాల్గొన్నారు.

వెల్మల్‌లో ఇఫ్తార్‌ విందు

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలం వెల్మల్‌ గ్రామంలో రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సర్పంచు గొజ్జి దేవేందర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసం శాంతి, సహనం, పరస్పర ప్రేమను పెంపొందిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, ముస్లింలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement