రెంజల్(బోధన్): మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో అందించారు. ఆదివారం మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. సకాలంలో చెక్కులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్, దండిగుట్ట సర్పంచ్ ధనుంజయ్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు గంగాకిషన్, ఎంఎల్ రాజు, జావీదోద్దిన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని సుదర్శన్‌రెడ్డికి వినతి
బోధన్: ఎడపల్లి గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం నిజామాబాద్ నగర కేంద్రంలోని స్వగృహంలో ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఆ గ్రామ ఉపసర్పంచ్ మచ్కూరి గంగాధర్, నాయకులు వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నందున పాలనపరంగా ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. సీసీ డ్రెయినేజీల నిర్మాణం ,కొన్ని చోట్ల కరెంట్ బోరుబావుల అవసరాలను వివరించారు. పంచాయతి ఖాళీ స్థానాల భర్తీ చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.బోధన్ ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, నాయకులు మస్తాన్, నవీన్, గోపి, పురం శేఖర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


