డిచ్‌పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సర్పంచ్ లొక్కిడి యాదగిరి శనివారం భూమిపూజ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చెరువు కట్టపై శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌజన్య అనిల్, గ్రామాభివృద్ధి కమిటీ క్యాషియర్ రాజరెడ్డి, రైటర్ దాసరి అశోక్, ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందించిన జేసీఐ ప్రతినిధులు


