కమ్మర్‌పల్లి: రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద ఉప సర్పంచ్ శశిధర్ నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజలకు త్వరగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. సర్పంచ్‌లు అశోక్, శైలేందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవి, నాయకులు తిప్పిరెడ్డి శ్రీను, బుచ్చిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


