నవీపేట: మండల కేంద్రంలోని సాహితీ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు జా తీయ స్థాయి అబాకస్ పోటీలలో ఉత్త మ ప్రతిభ కనబరిచా రు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన పోటీలలో సాహితీ విద్యానికేతన్‌కు చెందిన సాత్విక(3వ తరగతి), శ్రీక ర్(5వ తరగతి)లు జాతీయ స్థాయి రెండవ ర్యాంక్ సాధించారు. విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందని కరస్పాండెంట్ సునీత హర్షం వ్యక్తం చేశారు.
రుద్రూర్: పొతంగల్ మండలం పీఎస్‌ఆర్ నగర్ (రాంగంగానగర్ )లో గ్రామ మహిళ భవన్ నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ రాంబాయి భూమి పూజ చేశారు. మహిళ దినోత్సవం రోజూ మహిళ భవన్‌కు భూమి పూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు సర్పంచ్ అనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అట్కారి సతీష్ , వార్డు సభ్యులు శేఖర్ గైడ్, రమేష్, మాజీ ఉప సర్పంచ్ అశోక్, అంగన్‌వాడీ టీచర్ ప్రేమలత, వీఏవో స్వరూప, గ్రామ సంఘం అధ్యక్షురాలు సావిత్రి బాయి , సాయినాథ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లీలో కుటుంబ వివాదంలో అన్నకు గాయాలు కావడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిగల్లీకి చెందిన కొప్పుల సాయిలు మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి సాయిలు తన తండ్రి సాయిబోయిని ఇంటికి తీసుకొచ్చి తమ్ముడి ఇంటి వద్ద దింపేందుకు వెళ్లాడు. అక్కడ అడ్డుగా ఉన్న ఇటుకలను తొలగించగా అతని తమ్ముడు మక్కయ్య, అతని భార్య అక్కడికి వచ్చి గొడవకు దిగారు. మక్కయ్య అత్త, బావమరిది సాయిలును దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మక్కయ్య ఇటుకతో సాయిలు తలపై కొట్టినట్లు బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాక్లూర్: మండల పరిధిలోని సుఖిజిత్ ఫ్యాక్ట రీ శివారు పూలాంగ్ వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మాక్లూర్ పోలీసులు ఆదివారం తెలిపారు. వాగులో మృతహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మోపాల్: మండలంలోని న్యాల్‌కల్ గ్రామానికి చెందిన కంటేగారి జానాబా యి అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జానాబాయి న్యాల్‌కల్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త నర్సింగ్‌రావు గతంలోనే చనిపోయాడు. వీరికి పిల్లలు లేరు. ఈనెల 4న ఉదయం 7 గంటలకు కామారెడ్డి జిల్లా అంబార్‌పేట్‌లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా అక్కడికి వెళ్లలేదు.. గ్రామంలోని ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు పలు చోట్ల వెతికారు. కోడలు(వరుసకు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జానాబాయి ఆచూకీ తెలిసిన వారు 87126 59850 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
సిరికొండ: మండలంలోని మైలారం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ సర్దాన్ సదానంద్ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతు సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుగ్గెం నితీష్, వార్డు సభ్యులు చిన్నదాసు, వీడీసీ సభ్యులు గంగాకిషన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


