● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● 2కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్, మేయర్ కె ఉమారాణి
సుభాష్‌నగర్: అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 99 రోజు ల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉద యం నగరంలో 2కే రన్ నిర్వహించారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి చేపట్టిన రన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి ప్రా రంభించారు. కంఠేశ్వర్ బైపాస్ నుంచి ప్రధాన మా ర్గాల మీదుగా పాత ఆర్డీవో కార్యాలయం వరకు 2కే రన్ కొనసాగింది. అంతకుముందు ప్రతిజ్ఞచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. అంకితభావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్త మ అవార్డులు అందజేస్తామని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచి పేరు తేవాలన్నారు. వైద్యశాఖతో సమన్వ యం చేసుకుని మహిళలందరికీ ఆ రోగ్య పరీక్షలు నిర్వహించాలని, సర్వైకల్ క్యాన్సర్ నిరో ధం కోసం 14 నుంచి 15 ఏళ్లు కలిగిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా, వారి న్యాయమైన కోర్కెలు పరిష్కారమయ్యేలా తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు.
ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అ మలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చా రు. ప్రజలకు సదుపాయా లు మెరుగుపర్చేందుకు ప్రగ తి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికాారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు.
నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను నగర ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, ఇతర అన్నివిభాగాల అధికారులు, సిబ్బంది 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అడిషనల్ కమిషనర్ రవీందర్‌సాగర్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయ్‌కాంత్‌రావు, కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, పసునూరి రమేశ్, చింత శ్రీనివాస్‌రెడ్డి, మెప్మా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


