ఆర్మూర్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘ భవనం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ ఆదివారం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం ఆవరణలో స్వచ్ఛ భారత్ చేపడుతున్నామన్నారు. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామన్నారు.కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, వన్నెలేవి గంగాధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్, డ్రైవింగ్ స్కూల్ వేణు, చోల రాకేష్, కుతాడి ఎల్లయ్య, సాయి చరణ్, సుమన్, రాహుల్ రాజ్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


