నిజామాబాద్ లీగల్ : మహిళలు ఆకాశమే హద్దుగా అన్ని రంగా ల్లో విజయాలు సా ధించాలని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా ది నోత్సవం సందర్భంగా మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో పు రుషులతో పోటీ పడి ఎదగాలని అన్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చే సుకోవాలని, ఉద్యోగ ఒత్తిడిలో తల్లిగా బా ధ్యతలను విస్మరించొద్దన్నారు.
మహిళలకు భద్రత, సమాన అవకాశాలు..
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆ ర్థిక, సామాజిక అభివృద్ధి సాధించాలని క లెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు తె లిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పా త్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమా న అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
పెండింగ్ కేసులు
త్వరగా పరిష్కరించాలి
● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌అర్బన్: కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న మౌఖిక విచారణ కేసులను త్వరగా పూర్తిచేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 17 మౌఖిక విచారణ కేసుల దర్యా ప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఆర్మూర్, బోధన్ నిజామాబాద్ ఏసీపీలు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు.
పంటలకు సరిపడా యూరియా
డొంకేశ్వర్(ఆర్మూర్): పంటలకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందకుండా అవసరం మేరకే తీసుకోవాలని జి ల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నా రు. మండలంలోని నికాల్‌పూర్, డొంకేశ్వర్, గా దేపల్లి, నూత్‌పల్లి, గంగాసముందర్ సొ సైటీ గోదాములను శనివారం తనిఖీ చేసి యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రభు త్వం ప్రవేశపెట్టి న బుకింగ్ యాప్ ద్వారానే యూరియాను తీసుకోవాలని, దీనిని రైతులంతా అలవాటు చేసుకోవాల్సిందేనన్నారు.
● చెరువులో తోసి ముగ్గురు పిల్లల హత్య
కామారెడ్డి క్రైం: కన్న తండ్రే తన ముగ్గురు పిల్లలను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌బీనగర్ కాలనీలో నివాసం ఉండే ఇస్మాయిల్, షహీబాలకు ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) ఉన్నారు. ఇస్మా యిల్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం దుకాణంలో తినుబండారాలు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి చెరువులో తోసేసి చంపాడు. పిల్లలు తప్పిపోయినట్లు నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నాటకమాడాడు. అనుమానం వచ్చి పోలీసులు ఇస్మాయిల్‌ను విచారించగా తానే పిల్లలను పోషించలేక చెరువులో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు అర్ధరాత్రి వరకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి పిల్లల శవాలను వెలికి తీయించారు.


