పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Mar 9 2026 7:19 AM | Updated on Mar 9 2026 7:19 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణ ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొదిరే నాగమణి పేర్కొన్నారు. ఆదివారం ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్‌ వాహనంలో వేయాలని సూచించారు. వైస్‌ చైర్‌ పర్సన్‌ సంటి లత, కౌన్సిలర్లు, మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్స్‌, మెప్మా సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కోమట్‌పల్లిలో పరిసరాల పరిశుభ్రత

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని కోమట్‌పల్లి గ్రామంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రామాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సర్పంచ్‌ బర్కుంటి సుమలత పర్యవేక్షించారు. అనంతరం రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు.

దేగాంలో ప్రజా పాలన, పల్లె ప్రగతి

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆలూర్‌ మండలం దేగాం గ్రామంలో ఆదివారం ప్రజా పాలన, పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ఇట్టెడి లింగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ తడి, పొడి చెత్త వేరు చేయడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో..

ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజైన ఆదివారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. వాటర్‌ ట్యాంకులను, తాగు నీటి ట్యాంకులను, టాయిలెట్స్‌ లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ.మౌనిక, ఎస్‌.సుష్మ, వీ.సవిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement