జయహో భారత్‌ | - | Sakshi
Sakshi News home page

జయహో భారత్‌

Mar 9 2026 7:14 AM | Updated on Mar 9 2026 7:14 AM

టీ20 విజేతగా టీం ఇండియా ● జిల్లాలో క్రికెట్‌ అభిమానుల సంతోషం సంతోషంగా ఉంది ఉత్కంఠగా గడిపా.. బలమైన జట్టుపై భారీ గెలుపు

టీ20 విజేతగా టీం ఇండియా ● జిల్లాలో క్రికెట్‌ అభిమానుల సంతోషం

భారత్‌ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. దీంతో క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా పలు హోటళ్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు గెలుపు అనంతరం సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చారు. – నిజామాబాద్‌అర్బన్‌

భారత్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలవడం సంతోషంగా ఉంది. మన దేశానికి ఎంతో గర్వకారణం. ఇండియా ఆడే ప్రతి క్రికెట్‌ మ్యాచ్‌ తిలకిస్తాను. మన జట్టు గెలవాలని తాపత్రాయ పడేవాణ్ణి.

– చంద్రశేఖర్‌, మాజీ సైనికుడు, మామిడిపల్లి

రెండు రోజులుగా ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలుస్తుందా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న. మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నా. నా కల నెరవేరింది.

– భాస్కర్‌, క్రికెట్‌ అభిమాని

న్యూజిలాండ్‌ లాంటి బలమైన జట్టుపై భారీ విజయం సాధించడం గ్రేట్‌. న్యూజిలాండ్‌పై ఆడటం అంటే ఆందోళనకు గురయ్యాం. కానీ, భారత జట్టు పటిష్టమైన బౌలింగ్‌, బ్యాటింగ్‌తో సత్తా చాటారు.

– ప్రవీణ్‌, క్రికెట్‌ అభిమాని, ముబారక్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement