కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన కే. సరిత మండల ఉత్తమ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా అవార్డును అందుకున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు కల్యాణ మండపంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ, ఆక్స్ ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, కామారెడ్డి ఎస్‌ఈ రవీందర్, జిల్లా వెల్ఫేర్ అధికారిణి పద్మ చేతుల మీదుగా మండల ఉత్తమ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా సరిత ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు.


