ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల ఆలయం ప్రథమ పుష్కర (12వ) బ్రహ్మోత్సవాలకు యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు ఆదివారం అంకురార్పణ చేయడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆలయ పరిసరాల్లో గ్రామస్తులు శ్రమదానం చేశారు. ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి సంకల్ప బలంతో, దిల్‌ రాజు కుటుంబ సభ్యులు అకుంఠిత దీక్షతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నిర్మించి 12ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. 12 ఏళ్లు పూర్తయితే స్వామి వారి ప్రాభవం రెట్టింపుగా ఉంటుందని అర్చక అస్వాములు రోహిత్‌ కుమారాచార్య అన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు విజయసింహారెడ్డి, అర్చకులు సంపత్‌ కుమారాచార్య, రోహిత్‌ కుమారాచార్య, ఆలయ సభ్యులు నరాల సుధాకర్‌, నర్సారెడ్డి, రమేష్‌, మురళి, భాస్కర్‌, సురేష్‌, గంగారెడ్డి, సాయిలు, సాయి, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement