ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు

Mar 8 2026 7:23 AM | Updated on Mar 8 2026 7:23 AM

బోధన్‌: పొరుగు రాష్ట్రాల నుంచి ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని టీజీఎండీసీ(తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. రాష్ట్ర సరిహద్దులోని సాలూర మండల కేంద్రం శివారులో టీజీఎండీసీ అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ను కలెక్టర్‌ ఇలాత్రిపాఠితో కలిసి శనివారం భవేశ్‌ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. తెలంగాణ వైపు వచ్చే ఇసుక వాహనాలను చెక్‌పోస్ట్‌ వద్ద వేయింగ్‌ మిషన్‌తో తని ఖీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇసుక అక్రమరవాణాతోపాటు ఓవర్‌లోడింగ్‌ను నిరోధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. చెక్‌పోస్ట్‌ వద్ద ప్రతి వా హనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నా రు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని మహారాష్ట్ర ప్రాంత ఇసుక క్వారీల నుంచి తెలంగాణ వైపు నిర్ణీత పరి మాణం, నిబంధనలకు అనుగుణంగా ఇసుక తీసుకెళ్లొచ్చని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో సాలూ ర వద్ద చెక్‌పోస్ట్‌ నెలకొల్పామని, తద్వారా రాష్ట్ర ప్ర భుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఓవ ర్‌లోడ్‌ వాహనాలను అడ్డుకుని రోడ్లు చెడిపోకుండా, ప్రమాదాలు జరగకుండా నిలువరించవచ్చన్నా రు.

సరిహద్దు సమస్య తలెత్తకుండా..

మంజీర నదిలో సరిహద్దు సమస్య తలెత్తకుండా ఆఽ దునిక సాంకేతికత సహాయంతో పకడ్బందీ చర్యలు చేపట్టామని భవేశ్‌మిశ్రా తెలిపారు. రాష్ట్ర సరిహద్దు భూభాగాన్ని గుర్తిస్తూ స్పష్టంగా సరిహద్దులు ఏర్పా టు చేశామన్నారు. మంజీర నది నుంచి ఇసుక అక్ర మ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్ర త్యేక దృష్టిసారించిందని, ఇటీవల నిర్వహించిన కలెక్టర్‌ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేర కు స్పష్టమైన ఆదేశాలిచ్చారని వెల్లడించారు. ఇసుక తవ్వకాలు, రవాణా విషయంలో పాదర్శకత కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశ పె ట్టిందని, నిజామాబాద్‌ జిల్లాతోపాటు మరో నాలు గు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నా మన్నారు. మైనింగ్‌ శాఖ ఏడీ సంజయ్‌, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీ అశోక్‌, అధికారులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకు మహారాష్ట్ర

వైపు నుంచి ఇసుక తరలించాలి

ఓవర్‌లోడ్‌ వాహనాలను నిరోధిస్తాం

టీజీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌

భవేశ్‌మిశ్రా

సాలూర శివారులో

అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement