● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి
తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థుల మానసిక ఆరోగ్యమే దేశ ప్రగతికి సోపానం అని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి పేర్కొ న్నారు. తెయూ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ గోపిరాజు ఆధ్వర్యంలో శనివారం వర్సిటీ వి ద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యా, పోటీ పరీక్షలు, కుటుంబవ్యవహారాలు మొదలైన వాటి ద్వారా ఒత్తిడికి గురికాకుండా మా నసిక ధైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. డాక్టర్ గోపిరాజు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.కార్యక్రమంలో హాస్టల్స్ చీఫ్ వార్డెన్ రవీందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నిజామాబాద్, బోధన్ కేవీఎస్‌లలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉపాధ్యాయుల నియామకానికి ఈ నెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఇంటర్వ్యూలు నిజామాబాద్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రాంగణంలో జరుగుతా యని పేర్కొన్నారు. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ), టీజీటీ (ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఏటీఎల్ ఇన్‌స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సీటెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 9 నుంచి ఒరిజినల్ విద్యార్హత ల సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు పాఠశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసో సియేషన్ ఎన్నికల అధికారులుగా అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్‌లను నియమించినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి ప్రకటించారు. శనివారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సుదర్శన్‌కు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, బట్టు మాణిక్ రాజు, రెంజర్ల సురేశ్ నియామక పత్రాన్ని అందజేశారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 16 వరకు ఉపసంహరణ, 17న అభ్యర్థుల తుదిజాబితా, 26న ఎన్నికలు అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికయ్యే కార్యవర్గ సభ్యులు ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎల్లారెడ్డి: మండలంలోని కల్యాణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ శనివారం తెలిపారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న స మాచారం మేరకు దాడి చేసినట్లు పేర్కొన్నారు. 10 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.3,240 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.


