జీవనోపాధి..! | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి..!

Mar 9 2026 7:14 AM | Updated on Mar 9 2026 7:14 AM

ముంపు గ్రామాలకు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో త్వరలో ఎకో టూరిజం పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కేవలం ప ర్యాటక అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా స్థానిక ముంపు గ్రామాలకు జీవనోపాధిని చూపేలా రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన కసర త్తు ప్రారంభం కాగా.. ప్రతి పనిలో గ్రామస్తులను భాగస్వాములను చేసి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే డొంకేశ్వర్‌ మండలంలో గాదేపల్లి, చిన్నయానం, జీజీ నడ్కుడ గ్రామాల నుంచి కొంతమంది నిరుద్యోగ యువతను అధికారులు ఎంపిక చేశారు. వచ్చిన టూరిస్టులకు గైడ్లుగా పని చేసేందుకు, స్థానిక రుచులను అందించే క్యాంటీన్ల బాధ్యతలను వారికే అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వారిని ఈ నెలాఖరు లో హైదరాబాద్‌ తీసుకెళ్లి కొన్ని రోజులపాటు నైపు ణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా శిక్షణ ఇవ్వను న్నారు. మొదటి బ్యాచ్‌ పూర్తయిన తర్వాత మిగిలిన యువతకు కూడా దశల వారీగా శిక్షణ ఇచ్చి వన్యప్రాణుల సంరక్షణ, టూరిస్టులు పర్యావరణ కాలు ష్యం చేయకుండా పలుఉద్యోగాలతో ఉపాధి కల్పించనున్నారు. హోటళ్లు, రిసార్ట్‌లు, క్యాంటీన్లు లాంటి వ్యాపారాలు పెట్టుకునే విషయంలో ముంపు గ్రా మాల ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారు ఉ పాధి పొందేలా ప్రోత్సహించనున్నారు. తద్వారా స్థానిక గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. ఈ ని ర్ణయం పట్ల స్థానిక గ్రామాల యువతతో పాటు ప్ర జలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గాదేపల్లిలో త్వరలో ప్రారంభం

కానున్న ఎకో టూరిజం పనులు

స్థానిక యువతకు ఉపాధి

కల్పించేందుకు అటవీశాఖ ప్రణాళిక

ఇప్పటికే పలువురిని

ఎంపిక చేసిన అధికారులు

ఈ నెలాఖరులో

హైదరాబాద్‌లో శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement