న్యూస్‌రీల్
ప్రోత్సహిస్తే లక్ష్యాలను ఛేదిస్తాం..!
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
● కుటుంబ సహకారం తప్పనిసరి
● మహిళలను చిన్నచూపు చూడొద్దు
● ‘సాక్షి’ సర్వేలో యువతుల మనోగతం
వాతావరణం
ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఎండ ప్రకాశవంతంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.
ఇంటర్ కళాశాలల..
తెలంగాణ యూనివర్సిటీతోపాటు వర్సిటీ పరిధిలోని ఇంటర్ కళాశాలల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు.
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
– 10లో u
మీరు ప్రస్తుతం చదువుతున్న కోర్సును
మీరే ఎంచుకున్నారా ?
మీరు తీసుకునే రోజువారీ నిర్ణయాల్లో ఎంత శాతం స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు ?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం లభిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామని, అప్పుడే మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని యువతులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి 20 మంది చొప్పున నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, డిచ్‌పల్లి, బాల్కొండ నియోజకవర్గాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా వంద మంది 18 నుంచి 25 ఏళ్ల వయస్సు విద్యార్థుల మనోగతాన్ని ‘సాక్షి’ తెలుసుకుంది. ‘మీరెంత ఇండిపెండెంట్ ’ అనే అంశంపై సీ్త్ర స్వతంత్రంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబ సహకారం తప్పనిసరన్నారు. విద్య, వ్యాపారం వివిధ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలన్నారు. మహిళలను చిన్నచూపు చూడకుండా అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు.
మీ నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర
మద్దతు లభిస్తోంది ?
ఒక సీ్త్ర ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే..
ఎవరి సహకారం ఎక్కువ అవసరం
సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేసిన వారు మొత్తం 100 మంది (గ్రాఫ్‌లలో అభిప్రాయం చెప్పిన వారి సంఖ్య)


