రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో శుక్రవారం పట్టపగలే భారీచో రీ జరిగింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల శంకరయ్య – రాధ దంపతులు. వీరికి వివాహమైన కు మార్తెఉంది. స్వగ్రామంలోని ఎకరంలో సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. శుక్రవారం ఉద యం 9 గంటలకు పత్తి వేసిన పొలం పనులకు వె ళ్లారు. సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి రాగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీ రువా, లాకర్ ధ్వంసమై కనిపించాయి. వెంటనే డ యల్ 112 నంబరుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం జాగిలాలతో వచ్చి సోదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో 12 తు లాల బంగారు, కేజీ వెండి ఆభరణాలు, రూ.23వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై రామగుండం సీఐ కృష్ణకుమార్‌ను వి వరణ కోరగా బాధితుల నుంచి తమకు ఫిర్యాదు రాలేదన్నారు. దొంగలు రెక్కీ నిర్వహించిన తర్వాతే చోరీకి పాల్పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల విద్యుత్ కనెక్షన్లను కోతులు తెంచివేయడంతో పనిచేయడం లేదు. రెడు రోజుల క్రితం పొట్యాల, విసంపేట, మద్ధిర్యాలలోని పంట పొలాల్లోని విద్యుత్ పంపుసెట్ల తీగలను కాపర్ కోసం కట్ చేసుకొని వెళ్లిన ఘటన మరువకముందే భారీచోరీ జరగడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


