మారు పేర్ల సమస్య పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

మారు పేర్ల సమస్య పరిష్కరించాలి

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

గోదావరిఖని: సింగరేణిలో మారుపేర్లు, వి జిలెన్స్‌ కేసులు వెంట నే పరిష్కరించాలని ఐ ఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్‌ కోరారు. సోమవారం సంస్థ సీఎండీని హైద రాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల పేర్లలో ఉన్న మారుపేర్ల సమస్యతో ఉద్యోగ సంబంధిత హక్కులు, వారసత్వ/కారు ణ్య నియామకాలు, సర్వీస్‌ ప్రయోజనాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. కార్మిక కు టుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉద్యోగి నిరంతర సేవా రికార్డులు, సర్వీస్‌ వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు జనక్‌ప్రసాద్‌ తెలిపారు. సెంట్రల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్‌, కాంపెల్లి సమ్మయ్య, జనరల్‌ సెక్రటరీ వికాస్‌కుమార్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా మంగళవారం ఈవిషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement