జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమకారుల సమితి జిల్లా అధ్యక్షుడిగా మలిదశ ఉద్యమకారుడు కత్తెరమల్ల రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. నియామక పత్రాన్ని అందించారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ కత్తెరమల్ల రమేశ్ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
పరిహారం అందకుండానే కార్మికుడి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు మహ్మద్ నసీరొద్దీన్(71) వయోభారంతో సోమవారం మృతి చెందాడు. ఇతడికి రావాల్సిన వేతన బకాయిలు, ఇళ్లస్థలం ఇతరత్రా ప్రయోజనాలు అందకుండానే మృతి చెందడంపై బర్మా, కాందీశీకుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఇండిబిల్లి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే టెక్స్‌టైల్ మిల్లు కార్మికులకు రావాల్సిన బకాయిలు, ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
ఈతపోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్ అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి ఈతపోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీ నియర్ స్విమ్మర్స్ పలు పతకాలు సాధించా రు. ఆర్.ప్రశాంత్, గోల్డ్‌మెడల్, ఎం.శ్రీధర్ గోల్డ్, సిల్వర్, ఆర్.రామారావు, గోల్డ్, 2 కాంస్య, ఎ.రమేశ్‌కుమార్, గోల్డ్, మంగ వెంకటే శ్వర్లు కాంస్య, ఎం.శ్రీధర్ కాంస్య, బంగారి రాజయ్య సిల్వర్, కాంస్య పతకాలు సాధించినట్టు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపా రు. ప్రతిభ చూపిన స్విమ్మర్స్ హరియాణాలో సెప్టెంబర్‌లో జరిగే జాతీయస్థాయి ఈతపోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు.
రూ.20లక్షలతో డ్రైనేజీ నిర్మాణం
మంథని: మున్సిపల్ పరిధిలోని గొల్లగూడెం ప్రాంత ప్రజలు చాలాకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. రూ.20 లక్షలతో చేపట్టే డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ ఎల్లంకి వంశీధర్, నాయకులు పోతరబోయిన క్రాంతికుమార్, లైశెట్టి రాజు, స్థానికులు పాల్గొన్నారు.
సభ ఏర్పాట్ల పరిశీలన
పట్టణంలో ఈనెల 19న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు పెంటరి రాజు, ఎల్లంకి వంశీధర్ తదితరులు పరిశీలించారు. వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. నాయకులు ఎరుకల రమేశ్, ఖాజా, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు.
పోలీసులకు అనుమానాస్పద వ్యక్తుల అప్పగింత
కథలాపూర్: భూషణరావుపేటలో సోమవా రం మధ్యాహ్నం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు వింత వేషధారణలో కారులో భూషణరావుపేట వచ్చారు. పలు దుకాణాల్లోకి వెళ్లి భిక్షాటనకు వచ్చామని చెప్పి యజమానులపై పొగ పెట్టడంతో మత్తు మందు కావచ్చనే అనుమానంతో వారంతా కేకలు వేశారు. గ్రామస్తులు గుమిగూడి కారును అడ్డగించి వారిని నిలదీశారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నలుగురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.


