పెద్దపల్లి: జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన గర్భిణి(23)కి హైరిస్క్ ఉండడంతో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. వివిధ పరీక్షలు చేస్తూ సోమవారం సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సురక్షితంగా ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. మరో తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న మహిళ(37)కు శస్త్రచికిత్స విజయవంతం చేశారు. ఇందుకు కృషి చేసి వైద్యులు కుమార్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మేఘన, వినయ్‌కుమార్, రవళిక, స్వాతిని సూపరింటెండెంట్ శ్రీధర్ అభినందించారు.


