స్కూల్‌ బస్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు ప్రారంభం

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

గోదావరిఖనిటౌన్‌: ఆర్టీసీ గోదావరిఖని డీఎం కవిత కేటాయించిన బస్సును ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ స్థానిక సింగరేణి సెక్టా ర్‌–2 పాఠశాల ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు, విద్యార్థుల భద్రత, సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు కేటాయించారన్నారు. మేయర్‌ మహంకాళి స్వా మి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు

పెద్దపల్లిరూరల్‌: సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీసీసీ రాంరెడ్డి సూచించారు. పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను శుక్రవారం ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై నరేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. కౌన్సిలర్‌ సుజాత, క్రాంతికుమార్‌తోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

భద్రత ప్రమాణాలు పాటించాలి

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉద్యోగులు విధి నిర్వహణలో భద్రత ప్రమాణాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సామంత సూచించారు. ప్రాజెక్టులోని గేర్‌ బాక్స్‌లు, ఫ్లూయిడ్‌ కప్లింగ్‌ యూనిట్లు, పుల్లీలు, ఇతర కీలకమైన మెకానికల్‌ పరికరాలతో సహా ప్రధాన కన్వేయర్‌ భాగాల ఓవర్‌హాలింగ్‌, మరమ్మతు నిర్వహణను సులభతరం చేయడానికి ఎంహెచ్‌పి వర్క్‌షాప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఈ సదుపాయం ఇన్‌–హౌస్‌ నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందన్నారు. జనరల్‌ మేనేజర్లు ముకుల్‌ రాయ్‌, నవీన్‌ గుప్తా, అవిజిత్‌ దత్తా, బినోయ్‌ జోస్‌, ఏజీఎం(హెచ్‌ఆర్‌) సాగర్‌ రంజన్‌ సాహూ, వెంకట రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని బండారికుంటలో అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నామని ఎస్సై నరేశ్‌ శుక్రవారం తెలిపారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న సమీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement