గోదావరిఖని: స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధనకు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ముత్యంరావు కోరారు. శుక్రవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల హక్కుల కోసం వీరోచితమైన పోరాటాలు చేసి హక్కులు, చట్టాలు సాధించుకున్న ఘనత కార్మిక వర్గానికి ఉందన్నారు. 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షడు టి.రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, కోశాధికారి రామాచారి, ఉపాధ్యక్షుడు బిక్షపతి, నాయకులు నెర్వట్ల నర్సయ్య, లక్ష్మారెడ్డి, నరహరిరావు, ఎ.మొగిలి, శ్రీహరి, కిషన్, రవి, సాగర్, ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


