తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి: జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. తాగునీటి సరఫరా, సమస్యలపై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. మిషన్‌ భగీరథ ఈఈలు గంగాధర శ్రీనివాస్‌, పూర్ణచందర్‌, తదితరులు పాల్గొన్నారు.

17న దివ్యాంగులకు ఉపకరణాలు

రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ఆర్జీ–1 సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఈనెల 17న దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేస్తామని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. రామగుండం, పాలకుర్తి, అంతర్గాం ప్రాంతాలకు చెందిన వారే హారు కావాలన్నారు. బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రైసైకిల్‌, మూడు చక్రాల రిక్షా, వీల్‌చైర్‌, చంక కర్రలు, చేతికర్రలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94408 52495, 95507 96597 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement