గోదావరిఖని: పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిశోర్‌ఝా సూచించారు. ఏఆర్‌హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన టి.మోహన్, ఎస్.సత్త య్య శుక్రవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పోలీస్‌కమిషనర్ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ పదోన్నతి మ రింత బాధ్యతతో కూడిన అవకాశమన్నారు. విధు ల్లో నిజాయతీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేశ్, ఆర్‌ఐలు దామోదర్, రమేశ్, ఆర్‌ఎస్‌ఐ పోచలింగం, సీసీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


