పెట్రోల్‌బంక్‌లో అదుపుతప్పిన కారు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌బంక్‌లో అదుపుతప్పిన కారు

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

సిరిసిల్ల అర్బన్‌: పెట్రోల్‌బంక్‌లో పనిచేసే ఆపరేటర్‌ కారు నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి బంక్‌లోని పంపింగ్‌ మిషన్‌ను ఢీకొట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లో పనిచేసే పంపింగ్‌ ఆపరేటర్‌ డ్రైవింగ్‌ తెలియకపోయినా బంక్‌లో ఆగి ఉన్న కారును నడిపేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలోనే కారు అదుపుతప్పి బంక్‌లోని పంపింగ్‌ మిషన్‌ను ఢీకొట్టడంతో ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో పెట్రోల్‌బంక్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కారుపై ఇప్పటికే 5 చలాన్లు, ఒక ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసు నమోదై ఉన్నాయి.

పంపింగ్‌ మిషన్‌ ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement