ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని మా షాపింగ్ మాల్ వద్ద బంగారు పుస్తెలు పోగొట్టుకున్న జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల స్రవంతికిఎస్సై ప్రవీణ్‌కుమార్ శుక్రవారం తిరిగి అందించారు. గురువారంరాత్రి షాపింగ్‌మాల్‌లో బట్టలు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. బంగారు పుస్తెలు, గుండ్లు పొగోట్టుకుంది. బాధితురాలు పోలీస్టుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఆదేశాల మేరకు పోలీస్ కానిస్టేబుల్ సతీశ్.. సీసీ కెమోరా ఫుటేజీలు పరిశీలించారు. బంగారంతో ఉన్నపర్స్ తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. ఆ వ్యక్తిని ప్రశ్నించగా తనకు పర్స్ దొరినట్లు తెలిపాడు. బాధితురాలిని స్టేషన్‌కు పిలిపించి పుస్తెలు, గుండ్లతో ఉన్నపర్స్‌ను ఎస్సై అందించారు. సకాలంలో స్పందించిన పీసీని ఎస్సై అభినందించారు.


