జ్యోతినగర్: భారతదేశ అభివృద్ధిలో ఎన్టీపీసీ కృషి ఎంతోఉందని రామగుండం – తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన మాట్లాడారు. మనదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పం గురించి గుర్తు చేసుకోవాలన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభావంతులకు అవార్డులు, జ్ఞాపికలు అందించారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం ప్రతినిధులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరిస్తున్న చందన్ కుమార్ సామంత


