గోదావరిఖని: తన చివరిశ్వాస వరకూ ప్రజల వెంటే ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ప్రజలతో కలిసి ఆనందంగా నృత్యం చేశారు. అనంతరం మా ట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ జన్మదిన వేడుకలు ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్ చేసి అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, నాయకులు దీటి బాలరాజు, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.


