జ్యోతినగర్: విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఎన్టీపీసీ ఏరో షో ప్రోటోటైప్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఎన్టీపీసీ కాకతీయ హాల్‌లో ఏవియేషన్, ఏరోడైనమిక్స్, మోడల్ తయారీ వంటి అంశాలపై ఏరోవిషన్ ఏరో మోడలింగ్, నాగపూర్ అధినేత, మాజీ సైంటిస్ట్ రాజేశ్ ఎన్. జోషి అవగాహన కల్పించారు. విద్యార్థులు పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అనుభవం ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాలపై ఆసక్తి పెంచుకోవాలని, వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశం ఇదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం(హెచ్‌ఆర్)సాగర్ రంజన్ సాహు, ప్రవీణ్ కే చౌదరి, జ్యోతిక క్లబ్ కార్యదర్శి రంజిత్ కుమార్ పలు వురు నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్పీఎఫ్ సీఐకి పురస్కారం
రామగుండం: స్థానిక రై ల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్) సీఐ కొదురుపాక రాజేంద్రప్రసాద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన వేడుకలకు పరేడ్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పతాకావిష్కరణ తర్వాత అత్యుత్తమ విధులు నిర్వహించినందుకు డివిజనల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషనర్ నవీన్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రవర్మ, మేనేజర్ గోపాలకృష్ణ రూ.50వేలు అందజేశారు. స్థానిక ఆర్‌పీఎఫ్ ఎస్సై క్రాంతికుమార్, ఏఎస్‌ఐ మాసాని నాగరాజు, శేఖర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన
పెద్దపల్లిరూరల్: అమృత్ పథకం ద్వారా స్థానిక రైల్వే జంక్షన్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ శనివారం పరిశీలించారు. హమాలీలతో మాట్లాడి సమస్యల పై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. రామగుండం–మణుగూరు రైల్వే పనులు సాగుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రైల్వే సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
కన్నాలలో మద్యపాన నిషేధం
మంథనిరూరల్: కన్నాల గ్రామ పంచాయతీలో మద్యపాన నిషేధం విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. శనివారం గ్రామసభ నిర్వహించి పాలకవర్గం, గ్రామస్తుల ఆమోదంతో ఈ తీర్మానం చేశారు. ఆగస్టు 15నుంచి మద్యం అమ్మకాలు చేయరాదని, అతిక్రమిస్తే రూ.520వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ గుడిసె గట్టయ్య హెచ్చరించారు. మద్యపాన నిషేధం అమలుకు ఎకై ్సజ్, పోలీస అధికారులు సహకారం అందించాలని కోరుతూ తీర్మానపత్రాలను వారికి అందజేశారు. ఉపసర్పంచ్ గాదె దివ్య సంజీవ్‌రెడ్డి, వార్డు సభ్యులు ముస్కుల కృష్ణవేణి, వంగల కీర్తన, రామగిరి సంపత్, కావటి రజిత, పర్శవేన అనిల్, తోట శ్రావణ్, చంద్రు పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
జాతీయ జెండాకు అవమానం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్ ఆవరణలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగరేసిన పాఠశాల సిబ్బంది ఆ తర్వాత వెళ్లిపోయారు. కాసేపటికే పతాకం కిందకు జారింది. గమనించిన స్థానికులు విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వెంటనే సరిచేశారు. జాతీయ జెండా కిందకు జారిందని సమాచారం తెలియగానే సరిచేశామని పెద్దప ల్లి ఎంఈవో సురేందర్‌కుమార్ తెలిపారు.


