శాత్రజ్‌పల్లిలో భూమాయ! | - | Sakshi
Sakshi News home page

శాత్రజ్‌పల్లిలో భూమాయ!

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

● ప్రభుత్వ భూమి కబ్జా ● ఉపాధిహామీలో వేసిన రోడ్డు కూడా.. ● అక్రమార్కుల బరితెగింపు

విచారణ జరుపుతున్నాం

ముత్తారం: మంథని డివిజన్‌లో మారుమూలన ఉ న్న పల్లె శాత్రజ్‌పల్లి. ఒక గిరిజన గ్రామం కూడా. అ క్కడి ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. దాంతోపాటే రోడ్డునూ కబ్జా చేశారు. ఫిర్యాదుల తో స్పందించిన అధికారులు.. సర్వే చేయగా.. అది కబ్జా అని తేల్చి హెచ్చరికలు జారీచేశారు. అయినా అక్రమార్కులు వాటిని బేఖాతరు చేస్తున్నారు.

మానేరు ఉప్పొంగితే..

ముత్తారం మండలం పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు ఆవలివైపు ఉండేది మా రు మూల శాత్రజ్‌పల్లి. ఇది పూర్తిగా గిరిజన గ్రామం. మానేరు ఉప్పొంగితే రాకపోకలు స్తంభిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండ లం వెంకట్రావ్‌పల్లి వెళ్లడానికి ఉపాఽధిహామీ పథకంలో రూ.లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మించారు.

28 ఎకరాలు, రహదారి కబ్జా..

శాత్రజ్‌పల్లి గ్రామ శివారులోని 181 సర్వే నంబరు లో ప్రభుత్వ భూమి ఉంది. అందులో సుమారు 28 ఎకరాలతోపాటు ఉపాఽధిహామీ ద్వారా నిర్మించిన రహదారిని ఓ కబ్జాదారు ఆక్రమించేశాడు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా రోడ్డును సైతం ధ్వంసం చేసి సాగు చేయడం ప్రారంభించాడు. దీనిపై స్థానికులు, గిరిజనులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేయగా.. 181 సర్వే నంబరులో 21.26 ఎకరాలు కబ్జాకు గుర య్యాయని తేలింది. అంతేకాదు.. ఉపాధిహామీ ద్వారా నిర్మించిన రోడ్డునూ ఆక్రమించి సాగు చేశారని పారుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

అక్రమార్కులపై చర్యలేవి?

ప్రభుత్వ భూమి, ఉపాధిహామీ రోడ్డు కబ్జాకు గురయ్యాయని అధికారులు నివేదిక అందజేసినా అక్రమార్కులపై ఇంకా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లక్రితం పోతారంలో ప్రభుత్వ భూమి కబ్జాచేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.. తాజా భూఆక్రమణదారుపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్‌ ఈవిషయంలో జోక్యం చేసుకోవాలని విన్నవిస్తున్నారు. మరోవైపు.. జిల్లా, మండలస్థాయి అధికారుల దృష్టికి సమస్య వెళ్లినా పరిష్కారం కాకపోవడంతో ముత్తారానికి చెందిన మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు గిరిజనుల తరఫున హైకోర్డును ఆశ్రయించారు.

శాత్రజ్‌పల్లిలో భూఆక్రమణపై ఫిర్యాదు అందగానే విచారణ చేపట్టాం. ఓ వ్యక్తి ప్రభుత్వ భూమి చదును చేసుకుంటున్నాడని, ఏమై నా ఆధారాలు ఉంటే తమకు అందజేయా లని నోటీసులు జారీచేశాం. ప్రభుత్వ భూ మిని కబ్జా చేయొద్దని ఆ స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణ చేపట్టి తయారు చేసిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం.

– మధూసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement