మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 81,139 ఓట్ల తొలగింపు
అనామలీస్, అన్‌మ్యాప్డ్ ఓటర్లకు ఇక నోటీసులు
అక్టోబర్ 15లోగా విచారణకు హాజరు కావాల్సిందే..
అర్హులైన వారి పేర్లు తుది జాబితాలో ప్రచురణ
ముసాయిదా
ఓటరు జాబితా
జిల్లా ఓటర్ల సంఖ్య 6,31,018
లక్షల
1.27
సాక్షి పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఇంటింటి సర్వేలో ఓటర్ల వివరాల్లో భారీగా తేడాలు బయటపడ్డాయి. జూన్ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బీఎల్‌వోలు నిర్వహించిన ఎన్యూమరేషన్ ప్ర క్రియ అనంతరం తాజాగా విడుదలైన ముసాయి దా ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 6,31,018 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిలో 1,27,457 మంది (20.20 శాతం)అనామలీస్ ఓటర్లుగా, మ రో 20,065 మంది ఓటర్లను అన్‌మ్యాప్డ్‌గా, అలాగే జిల్లావ్యాప్తంగా 81,139 మంది చనిపోవడం, వలసపోవడం, వారిచిరునామా దొరకని వారిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. మొత్తంగా సోమవా రం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను నోటీసు బోర్డులపై అతికించారు.
భారీగా తగ్గనున్న ఓట్లు
జిల్లాలో జూన్ 10 నాటితో పోలిస్తే ఆగస్టు 17 నాటి కి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 7,12,157 మంది ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితా నాటికి ఈసంఖ్య 6,31,018కి పడిపోయింది. చనిపోవడం, వలస వెళ్లడం, చిరునా మా లభించక ఏకంగా 81,139 మంది(11.39శాతం) ఓట్లను జాబితా నుంచి తొలగించారు.
● అనామలీస్ (లోపాలు ఉన్నవి): డిజిలైజ్ అయిన ఓటర్లలో పేరు, చిరునామా, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులున్న అనామలీస్ ఓటర్లు 1,27,457 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా మంథని నియోజకవర్గంలో 54,654 అనామలీస్ ఓట్లు ఉండటం గమనార్హం.
● మ్యాపింగ్ కానివి: ప్రస్తుత ఓటరు జాబితాకు, 2002 ఓటరు జాబితాకు లేదా తల్లిదండ్రుల వివరాలకు సంబంధించి అనుసంధానం కాని ఓటర్లు జిల్లాలో 20,065 మంది ఉన్నారు.
అనుమానాస్పద ఓటర్లుకు విచారణ తప్పనిసరి!
జిల్లాలో ఉన్న 1.27 లక్షల అనామలీస్ ఓటర్లు, మ్యా పింగ్ కాని 20 వేల మందిని ఎన్నికల సంఘం ‘అ నుమానాస్పద’ ఓటర్లుగా పరిగణించింది. తొలగించిన 81 వేల మందితోపాటు, ఇప్పుడు నోటీసులు అందుకోనున్న ఈ 1.48 లక్షల మందిని కలుపుకుంటే.. మొత్తంగా జిల్లా ఓటర్లలో దాదాపు 32 శాతం మంది ఓటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. సోమ వారం నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈఆర్వోలు వీరికి నోటీసులు జారీచేసి విచారణకు పిలుస్తారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరై ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదోఒకటి రుజువుగా చూపించాల్సి ఉంటుంది. అధికారుల విచారణలో సంతృప్తి చెందితేనే అక్టోబర్ 19న వచ్చే తుది జాబితాలో వీరి పేర్లు ఉంటాయి.
రాజకీయ వర్గాల్లో టెన్షన్..
ఓటర్ల సంఖ్య తగ్గడం, జాబితాలో లక్షల లోపాలు బయటపడటంతో ప్రధాన రాజకీయ పార్టీల నా యకుల్లో ఆందోళన మొదలైంది. తొలగించిన, తొ లగింపు ముప్పు ఎదుర్కొంటున్న వారిలో ఏ పార్టీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
అసెంబ్లీ పాత కొత్త తగ్గినవి అనామలీస్ అన్‌మ్యాప్డ్
రామగుండం 2,13,990 1,83,233 30,757 49,040 5,555
మంథని 2,38,765 2,14,924 23,841 54,652 8,074
పెద్దపల్లి 2,59,402 2,32,861 26,541 23,775 6,436
మొత్తం 7,12,157 6,31,018 81,139 1,27,457 20,065
కొత్త వారికి అవకాశం
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, పేరు గల్లంతైనవారు, కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా ఓట రు నమోదుకు ఫారం–6, వివరాల మార్పు లే దా తప్పుల సవరణకు ఫారం–8 ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. ఈఆర్వోలు సంతృప్తి చెందితేనే అక్టోబర్ 19న ప్రకటించే తుది సర్ ఓటరు జాబితాలోకి వీరిపేర్లను ప్రచురిస్తారు.


