గోదావరిఖని: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో పెద్ద పల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని సీపీ అన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ పాల్గొన్నారు.
అత్యవసర సేవలకు ‘112’
పెద్దపల్లి: పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇటీవల డయల్ –112 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు పోలీసు డయల్ 100, వైద్యం 108, అగ్నిమాపక 101, మహిళల భద్రత సేవల కోసం డయల్ 181, 1091, 1092 నంబర్లు ఉండేవి. ఇలాంటి సేవలన్నింటినీ ఒకేనంబర్ ద్వారా పొందే అవకాశం తాజాగా కల్పించారు. డయల్–112 దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
మంత్రుల పర్యటనకు భారీబందోబస్తు
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలంలో ఈనెల 17న జరిగే మంత్రుల పర్యటనకు భారీ బందోబస్తు చేపట్టామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. గర్రెపల్లి – కాల్వశ్రీరాంపూ ర్ మండలం పెగడపల్లి వరకు చేపట్టే రోడ్డు ని ర్మాణం కోసం మంత్రులు చేసే శంకుస్థాపన స్థ లాన్ని సోమవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి ప రిశీలించారు. డీసీపీ మాట్లాడుతూ సామాన్యులకు ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌పై ఏసీపీతోపాటు సీఐరంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్‌తో చర్చించారు.
మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా
మంథనిరూరల్: తమ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా విధిస్తామని నా గారం గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమ వారం తీర్మానించిందని సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి తెలిపారు. తీర్మాన పత్రాలను ఎకై ్సజ్, పోలీస్ అధికారులకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ, బెల్ట్‌షాప్‌ల నిర్వహణతో యు వత మద్యానికి బానిసై భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోందన్నారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజల ఆమోదం మేరకు మద్యపాన నిషేధం అమలుకు తీర్మానించామని ఆమె వివరించారు. ఉపసర్పంచ్ ఎరుకల లలిత, వార్డు సభ్యులు బూడిద తిరు పతి, ఎరుకల రాజశేఖర, దాసరి రవీందర్, బూడిద శ్రీకాంత్, జక్కుల భాగ్యలక్ష్మి, తోకల శైలజ, అనసూయ సత్తమ్మ, వీవో అధ్యక్షురాలు ఎరుకల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతులో ఎన్టీపీసీ యూనిట్
జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ 500 మెగావాట్ల ఐదో విద్యుత్ యూనిట్‌ను సో మవారం వార్షిక మరమ్మతుల కోసం నిలిపివేశారు. సుమారు 20 రోజులపాటు మరమ్మతు చేపట్టనున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి అన్ని యూనిట్లకు షెడ్యూల్ ప్రకారం వార్షిక మరమ్మతు చేపడతారు. విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండడంతో ప్రస్తుతం పలు యూనిట్లు సగం సామర్థ్యంతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. సౌరవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో థర్మల్ కేంద్రాల్లో పూర్తిసామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదని తెలుస్తోంది.
నేడు ‘సర్వాయి’ జయంతి
పెద్దపల్లి: సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఈనెల 18న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి సోమవారం తెలిపారు. సామాజిక సమానత్వం, బహుజనుల ఆత్మగౌరవం కోసం సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం, చూపి న ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొఓన్నారు. వేడుకులను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


