కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.30 వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశాక కలెక్టర్‌ను ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ ఆస్పతుల్లో మెరుగైన వైద్యం అందించాలని, స్కూళ్లు, వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్‌కు సమర్పించారు.
లోతట్టు ప్రాంతాలు వర్షానికి జలమయమవుతున్నాయి. నీరు రాకుండా చూడాలి. గాంధీనగర్, జోవహార్ నగర్, స్వప్నకాలనీ అనుమతులు లేకుండా సాగే ఆక్రమణలను ఆపి, బాధ్యులపై చర్య తీసుకోవాలి.
– లక్ష్మణ్, పాపయ్య, సుల్తానాబాద్


