ఆదర్శ నగరం మన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ నగరం మన లక్ష్యం

Aug 16 2026 12:21 AM | Updated on Aug 16 2026 12:21 AM

ఆదర్శ నగరం మన లక్ష్యం

కోల్‌సిటీ: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. బల్దియాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకం ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్య్రం చారిత్రక ఘట్టమేకాదని, ప్రగతి, సామాజిక సమానత్వం, స్వయం సమృద్ధి లక్ష్యాలతో సాగే నిరంతర ప్రయాణమన్నారు. పాలకవర్గం నేటితో ఆరు నెలల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుందని తెలిపారు. కమిషనర్‌ అరుణశ్రీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే సహకారాన్ని కొనసాగించాలన్నారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement