టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య ఆర్జీ–1 ఏరియా జీడీకే–2పై బాయిబాట బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్
గోదావరిఖని: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదామని టీజీబీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంగెర్ల మల్లయ్య కోరారు. బాయిబాటలో భాగంగా ఆర్జీ–1 ఏరియా జీడీకే–2వ గనిని శుక్రవారం ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. నష్టాల్లో ఉన్న సంస్థను కార్మికులంతా కలిసి లాభాల బాటలోకి తీసుకొచ్చారని తెలిపారు. కానీ నేడు సంస్థ ఆర్థికంగా వెనకపడిపోయిందన్నారు. సంస్థకు రావాల్సిన బకాయిలు వెంటనే అందజేసి కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికులకు పనిముట్లు అందజేయడంలో యాజమాన్యం విఫలం అయ్యిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలాగా కార్మికులు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు దొడ్ల సతీశ్, జక్కుల శంకర్, రేగుల నరేశ్, భాస్కర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


