వైభవం.. మల్లన్న పెద్ద పట్నం
ముత్తారం: ముత్తారం మండలం పారుపల్లి మల్లన్న గుట్టలోని శ్రీఆది మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం పెద్ద పట్నం మహోత్సవం వైభవంగా జరిగింది. ముత్తారానికి చెందిన కుర్మగొల్ల కులపెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మల్లన్న ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచులు చొప్పరి సంపత్, రవీందర్‌రావు, ఉప సర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్, నాయకులు అమ్ము దేవేందర్, ఓదెలు, తిరుపతి పాల్గొన్నారు.
కమాన్‌పూర్(మంథని): శ్రావణమాసం పురస్కరించుకొని కమాన్‌పూర్‌లోని స్వయంభు శ్రీఆది వరాహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని ముడుపు కట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ ముస్త్యా ల దామోదర్, ఈవో కాంతారెడ్డిలు ఏర్పాట్లు చేశారు.
కనుల పండువగా ఆలయ వార్షికోత్సవం
రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీసంతోషిమాతా ఆలయ 51వ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. శ్రీసంతోషిమాత విగ్రహం, ఆలయ ముఖద్వారం, గర్భాలయాన్ని వివిధ రంగుల పూలతో అలంకరించారు. ఆలయ ఫౌండర్స్ రత్నీదేవి, లోకేష్, అగర్వాల్, శివసంతోష్ అగర్వాల్ నేతృత్యంలో హోమం నిర్వహించారు. అమ్మ వారికి వివిధ రకాల అభిషేకాలు చేశారు.


