పెద్దపల్లి: జాతీయస్థాయిలో స్వచ్ఛ పాఠశాలగా ఎంపికై న పాలకుర్తి మండలం ఎల్కలపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయుడు అనుమాల లక్ష్మీనారాయణ సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రా రంభించిన ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంలో భాగంగా తమ పాఠ శాల రాష్ట్రస్థాయిలో 4, జాతీయ స్థాయి లో 47వ స్థానం సా ధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కలె క్టర్ ఇటీవల పాఠశాలను సందర్శించి వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. దీంతో సోలార్ ప్యా నల్స్, వాల్‌పెయింటింగ్స్ తదితర సౌకర్యాలు కలల్పించారు. కలెక్టర్ అభినందించారు.


