పేదలకు స్మార్ట్‌కార్డులు | - | Sakshi
Sakshi News home page

పేదలకు స్మార్ట్‌కార్డులు

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

● నేటినుంచి లబ్ధిదారులకు పంపిణీ ● తొమ్మిది రకాల భద్రతా ఫీచర్లతో కొత్త కార్డులు

మీసేవకు వెళ్లకుండానే..

పెద్దపల్లి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుటింది. ఈనెల 15న వీటిని పంపిణీ చయనుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనుండగా.. జిల్లా కేంద్రంలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్మార్ట్‌రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

జిల్లాలో 2,46,157 కార్డులు

జిల్లాలో 2,46,157 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిద్వారా పేదలు రేషన్‌ పొందుతున్నారు. ఇకపై ప్రజా పంపిణీ వ్యవస్థలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులను వినియోగించనున్నారు. కొత్తకార్డులతో రేషన్‌ పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించనున్నారు. కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తొమ్మిది రకాల భద్రతా ఫీచర్లు

నకిలీకి అవకాశం లేకుండా స్మార్ట్‌రేషన్‌ కార్డుల్లో ఆధునిక భద్రతా సాంకేతికతను పొందుపరిచారు. పాస్‌పోర్టులు, కరెన్సీనోట్లలో ఉపయోగించే తరహా భద్రతా అంశాలను ఇందులో వినియోగించారు.

అసెంబ్లీ కార్డులు

పెద్దపల్లి 1,04,025

మంథని 49,425

రామగుండం 74,601

ధర్మారం(మండలం) 18,108

స్మార్ట్‌ రేషన్‌ కార్డులో కుటుంబయజమాని ఫొటోతోపాటు సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్‌కార్డు కోసం ఇకపై మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో లాంఛనంగా ప్రారంభిస్తాం. తర్వాత మండలాల వారీగా పంపిణీ చేస్తాం. ఇందుకోసం త్వరలోనే షెడ్యూల్‌ ప్రకటిస్తాం.

– శ్రీనాథ్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement