మనదేశం సాంకేతికతతో అన్నిరంగాల్లో దూసుకెళుతోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించడం ఖాయం. విదేశీయుల టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతో ఇప్పటికే అనేక విజయాలు సాధించి ప్రపంచ దేశాలనే నివ్వెర పర్చుతోంది.
– అర్చన, విద్యార్థిని, పెద్దపల్లి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పొరుగు విదేశాలకు వలసవెళ్లడం కాదు.. మనదేశ యువతే ప్రపంచ దేశాల కంపెనీలను శాసించేస్థాయిలో పట్టు సాధించాలి. పరదేశీయులే జాబ్స్ కోసం మనదేశం వైపు చూడాలి. ఇది 2047 వరకు సాధ్యమవుతుందనే నమ్మకం ఉంది.
– గాయత్రీ, పెద్దపల్లి
ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా యువత ఆధునికత సాంకేతికతపై పట్టు సాధించాలి. విదేశాలపై ఆధారపడకుండా సొంత పరిజ్ఞానంతోనే సూ పర్ కంప్యూటర్లు సృష్టించే హబ్‌గా ఎదుగుతాం. సాంతికేతకను అందిపుచ్చుకుంటాం.
– సిరిహాసిని, పెద్దపల్లి
సహజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతాం. ఇప్పటికే పీఎం సూర్యఘర్ లాంటి పథకంతో సౌరశక్తితో విద్యుత్ ఉత్పత్తికి బాటలు వేసుకున్నాం. ప్రజలూ భాగస్వాములవుతున్నారు.
– వైష్ణవి, సెకండియర్, పెద్దపలి


