భవిష్యత్‌ అంతా జెన్‌ – జీలదే.. | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ అంతా జెన్‌ – జీలదే..

Aug 16 2026 12:33 AM | Updated on Aug 16 2026 12:33 AM

పెద్దపల్లి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం హర్‌ ఘర్‌ తిరంగా ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో అలంకరించిన వందలాది సంఖ్య ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యత చాటిచెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ భవిష్యత్‌ జెన్‌ –జీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, తిరంగా యాత్ర జిల్లా కో–కన్వీనర్‌ ఊషణ అన్వేష్‌, పట్టణ కన్వీనర్‌ మధుకరన్‌, అధ్యక్షుడు పెంజర్ల రాకేశ్‌, జిల్లా కార్యదర్శి శివంగారి సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement